16, అక్టోబర్ 2018, మంగళవారం

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెనో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా... ఓ మూగ మనసా...

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు 
నాటక రంగానివే మనసా ... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వెరిచేవో ఎందుకు రగిలేవో... 
ఎందుకు రగిలేవో ఏమై మిగేలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా 

కోర్కెల సెల కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే
మాయల దెయ్యానివే మనసా
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు... 
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెనో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా... ఓ మూగ మనసా...

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

తెలుగు విడిపోదు

విడదీయగానౌనె? వేయండ్ల పద్య సుగంధమ్ము నన్నయ్య బంధమిపుడు?
పంచీయగానౌనె? పశులకాపరికైన పాడనేర్పిన మన భాగవతము!
పగలు గోట్టగనౌనె? బంఢనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి,డాలు 
పాయచీల్చగనౌనె? బంగారు తోటలో ఘంటసాలగ పారు గాన ఝరిని
ప్రాంతములు వేరుపడినను భాద లేదు 
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె 
తెలుగు విడిపోదు చెడిపోదు 
తెలుగు వెలుగు రెండు కన్నులతో ఇక నుండి వెలుగు

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

Life is Beautiful - II


లేత లేత చిగురులాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు
కమ్మ గాలి తీసుకున్న శ్వాస  కొత్త  పాట పాడుతుంది చూడు
ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా 
ఆకులు నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ
అంతాఒక్కటయి నడిచే బాటలో
Life is Beautiful Life is Beautiful
ఒకటే  గొంతుగా పలికే పాటలో
Life is Beautiful Life is Beautiful
లేత లేత చిగురులాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు
కమ్మ గాలి తీసుకున్న శ్వాస  కొత్త  పాట పాడుతుంది చూడు 

Put your hands in the air 
And clap your hands
One... Two... Three..
 
చిందులతో కధ మొదలైనా
చింతలను మలుపులలోన
చేయి విడువని చెలిమంటే 
మాదేరా మాదేరా మాదేరా మాదేరా
పంతములు విడదీస్తున్నా
బంధములు పెనవేస్తుంటే 
ప్రేమ బలపడుతుందంతే
నిన్నయినా నేడైనా రేపైనా ఎపుడైనా
రెమ్మలతో నింగినే తాకినా
నేలనే వదలవు వేళ్ళు
తెలుసుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
 
Life is Beautiful Life is Beautiful ||2||
 

కాలం మలుపులో తుంటరి వయసులో
స్నేహం వెలుగులో Life is Beautiful
కాలం మలుపులో తుంటరి వయసులో
స్నేహం వెలుగులో Life is Beautiful
ప్రేమల నీడలో గుండెల ఊహలో
అందరి దారిలో Life is Beautiful

Life is Beautiful Life is Beautiful ||4||

Life is Beautiful


ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
 ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని.. లేలే అని
జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం
అందరని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని
వేకువే వేచిన వేళలో లోకమే కోకిలయి పాడుతుంది
Life is Beautiful Life is Beautiful  || 4||
ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం

రోజంతా అంతా చేరి సాగించేటి 
చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్దోలే ఇంటా బయటా మాపై విసిరే 
చిన్ని విసురులు కొన్ని  కసురులు
ఎండయినా వానయినా ఏం తేడా లేదు 
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు  నవ్వులు బాధలు 
సందడులు సంతోషాలు పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
Life is Beautiful Life is Beautiful  || 4||
 
సాయంత్రమైతే చాలు చిన్న పెద్దా 
రోడ్డు  మీదనే హస్కు వేయడం
దీవాలి హోలి క్రిస్మస్ భేదం లేదు
పండగంటే పందిళ్ళు వేయడం
ధర్నాలు  రాస్తా రోకులెన్నవుతున్నా
మమ్ము చేరనే లేవులే ఏ క్షణం
మా  ప్రపంచమిది మాదిది 
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది ఈ రంగుల రంగుల జీవితం
Life is Beautiful Life is Beautiful  || 4||






అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని

అమ్మా అని కొత్తగా... మళ్ళీ పిలవాలని
తుల్లే పసి ప్రాయమే... మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేల నిలిచే దాక  తోడుగా 
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా 
నువు కావాలే అమ్మా నను వీడోద్దే అమ్మా; బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా... మళ్ళీ పిలవాలని
తుల్లే పసి ప్రాయమే... మళ్ళీ మొదలవ్వనీ

నిదురలో నీ కల చూసి తుల్లి పడిన ఎదకి 
ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై 
ఏ కధలను వినిపిస్తావో జాబిలమ్మవై
నింగీ నేల నిలిచే దాక  తోడుగా 
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా 
నువు కావాలే అమ్మా నను వీడోద్దే అమ్మా; బంగారం నువ్వమ్మా

చిన్నిచిన్ని తగవులే మాకు లోకమయినవిగా
నీ వెతలు మనసునెపుడైన పోల్చుకొన్నదా?
రెప్పలా కాచిన నీకు కంటి నలుసులాగా
వేదనలు  పంచిన మాకు వేకువ ఉన్నదా?
నింగీ నేల నిలిచే దాక  తోడుగా 
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా 
నువు కావాలే అమ్మా నను వీడోద్దే అమ్మా; బంగారం నువ్వమ్మా

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మొదటి అడుగు

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు... ఎవరో ఒకరు... ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి  అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళతో బాట అయినది
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా 
అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే 
మబ్బు పొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా  
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు

చెదరగకపోదుగా  చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు  చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాలరాతిరి
పెదవి  ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి కరుగునా? 
జాలి  చూపి తీరమే దరికి చేరునా?
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు



6, సెప్టెంబర్ 2012, గురువారం

కొంత మంది సొంతపేరు కాదుర గాంధి

రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్

కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కరెన్సీ నోటు మీద; ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధి
భరత మాత తలరాతను మార్చిన విధాతర గాంధి
తరతరాల యమయాతను తీర్చిన వరదాతర గాంధి 
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి

రామ  నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆ శ్రమ దీక్ష  స్వతంత్ర కాంక్ష  ఆకృతి  దాల్చిన ఆవధూత; అపురూపం ఆ చరిత
కర్మ  యోగమే జన్మంతా; ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభావామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ  భగవద్గీత; ఈ బోసి నోటి తాత
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
 మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి
సత్యాహింసల మార్గ జ్యోతి; నవ శకానికే నాంది

రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్
రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత; సిసలైన జగ్జేత
చరఖా యంత్రం చూపించి స్వదేశి  సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బందిచాడుర జాతి పిత;  సంకల్ప బలం చేత
సూర్యుడు  అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడి రాత్రికి  స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి
పదవలు కోరని పావన మూర్తి; హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలా తలపై నడిచిన ఈ నాటి సంగతి
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరలాకు చెప్పండి

31, ఆగస్టు 2012, శుక్రవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - VI

                               శీర్షికలు :  ప్రాస, హాస్య బ్రహ్మ జంధ్యాల  
    
"అసలు పెళ్ళి కావలసిన పిల్ల ఇంత రాత్రిదాకా అడవిలో తిరుగుల్లేమిటి?"
 "చిన్నప్పుడు బల్లెగ్గొట్టి, గుర్రపు బల్లెక్కి,  జీళ్ళు, ఇంకా కుల్లు తిల్లు తింటూ, పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ, గుళ్ళు, గోపురాలు తిరుగుల్లు తిరిగి, అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు, రోజా తిరుగుల్ల గురించి మాట్లాడడమా? అసూయాంతకారా."
"అబ్బా, నీ ప్రాసతో చస్తన్నాను నాన్న. గుక్క తిప్పుకోకుండా, ఎంత ప్రాస మాట్లడతావో మాట్లాడు చూస్తాను."
"సరదాగా ఉందా?"
"ఊ"
"ఈస్టు స్టువర్టుపురం స్టేషను మాష్టరుగారి  ఫస్ట్ సన్ వెస్టుకెళ్ళి తనకిష్టమైన, అతి కష్టమైన బారిష్టర్ టెస్టులో, ఫస్ట్ క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్ష్టింటాయనని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే;ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్టులో బెస్ట్ బెస్ట్ అంటూతినేసి హోస్టుకు కూడా  మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్టు చేయకండా ఆయన సుష్టుగా బోంచేసి పేస్టు పెట్టి పల్లు తోముకొని మరీ రెస్టు తీసుకున్నాడట. ఏ రుస్టూ లేకుండా. చాలా? ఇంకా వదలమంటావా భాషా బలటాలు; మాటల తూటాలు; యతి ప్రాసల పరోటాలు."
-వేటగాడు (పాతది)


" నాన్న నీ ప్రాస ఆపు చస్తున్నాను. ఈ జన్మలోనువ్వు కధ రాయలేవు. రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ఈ ప్రాస ప్రాయాసున్ను?"
" నోరు ముయ్. మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా, బక్కచిక్కిన కుక్క గొడుగు మొక్కలా,  చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోటిలో కుక్కుతూ, గోక్కుతూ, బెక్కుతూ, చుక్కలు లెక్కబెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని, డొక్కు వెధవలా గోళ్లు చెక్కుకుంటూ, నక్క పీనుగులా చక్కిలాలు తింటూ,  అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా,  చిక్కుజుట్టేసుకొని, ముక్కుపొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాని రక్కుతూ, పెక్కు దిక్కు మాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి , ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే;   ఏ పక్కోకో ఓ పక్కకెళ్ళి, పిక్క బలం కొద్ది తిరిగి, నీ డొక్కసుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కిలు తినిపించి, నీ లక్కు పరీక్షించుకొని, ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకొని తీసుకురావొచ్చుకదరా తిక్క సన్నాసి."
-ఆనంద భైరవి.
                                  

28, ఆగస్టు 2012, మంగళవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - V

                                    శీర్షికలు: మనిషి, భాష


ఎవరూ  పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి?
-మాయాబజార్(1957) 

తెలుగు  చచ్చిపోయే పరిస్థితే వస్తే, దాని కంటే ఒక్క రోజు ముందు నేనే చచ్చిపోతానురా. పక్క రాష్ట్రాల వారు భాషా భాష అని చచ్చిపోతుంటే, మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. 
తెలుగంటే ముప్పై అయిదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా.
అది మనం అమ్మతో భాదలని, ఆనందాలని పంచుకొనే వారధి. అయినా దెబ్బ తగిలితే shit అని ఆశుద్దాని నోటిలో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్ధమౌతుందిరా?
-పిల్ల జమిందార్ (కొత్తది) 

పాండిత్యం  కన్నా జ్ఞానమే ముఖ్యం
-మాయాబజార్(1957)

ఆశ cancer ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది. భయం ulcer ఉన్నవాడిని కూడా చంపేస్తుంది.
-జులాయి

పరిగెత్తే  నీళ్లకు ఒళ్లంతా కాళ్ళు; భగభగా మండే మంటకు ఒళ్లంతా నోళ్ళు; కీచకులకి ఒళ్లంతా కళ్ళు.
-పెళ్ళి పుస్తకం

అసూయ ఘాటైన ప్రేమకు thermometer.
-పెళ్ళి పుస్తకం

మంచీ చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. 
-పెళ్ళి పుస్తకం 

గెలుపేముందిరా! మహాయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ఈ ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయమౌతుంది.
-పిల్ల జమిందార్ (కొత్తది)  

మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనషి తనకు తానుగా ఏర్పరుచుకున్న హద్దుల పరిధి మతం.   ఈ ప్రపంచమంతా ఒక్క కుటుంబం; వసుదైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే మతం; అది మానవత్వం. సమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం. మనుషుల బతుకులను చితుకులు చేసి మండిచేది మతం కాదు; మనకది హితం కాదు. అదే మతమైతే, ఆ మతం ఎంత గొప్పదైన వద్దు; నాకు వద్దు.
 -పడమటి సంధ్యా రాగం 

30, మే 2012, బుధవారం

బలయుతుడైన వేళ

బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని యాతదే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చు తఱి సఖ్యము జూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!