12, డిసెంబర్ 2008, శుక్రవారం

అయితే .... Full Fledged Optimism

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చెస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే umbrella ఎపుడూ ఓ వాన నువ్వొస్తానంటే ....
నిదులకు తలుపులు తెరవగ మనకొక అలి బాబ ఉంటే ఉంటే ...
అడిగిన తరుణమే పరుగులు తీసే alladin genie ఉంటే
చూపదా మరి.. ఆ మాయ దీపం...
మన fate ఏ flight అయ్యే runway...

నడి రాత్రే వస్తావే స్వప్నమా!
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా?
ఊరికినే ఊరిస్తే న్యాయమా?
సరదాగ నిజమైతే నష్టమా?
monalisa మొహం మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా? ...
ఇలా రావా? ....

వేకువనే మురిపించే ఆశలు
వేను వెంటే అంత నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాల కన్నులు
ఇలాగేన ప్రతి రోజు... ఎలాగైన ఏదో రోజు మనదై రాదా?!! ...

9, డిసెంబర్ 2008, మంగళవారం

మా తెలుగు తల్లికి మల్లే పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి



గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక



రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!