దేశభక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశభక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2012, గురువారం

కొంత మంది సొంతపేరు కాదుర గాంధి

రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్

కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కరెన్సీ నోటు మీద; ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధి
భరత మాత తలరాతను మార్చిన విధాతర గాంధి
తరతరాల యమయాతను తీర్చిన వరదాతర గాంధి 
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి

రామ  నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆ శ్రమ దీక్ష  స్వతంత్ర కాంక్ష  ఆకృతి  దాల్చిన ఆవధూత; అపురూపం ఆ చరిత
కర్మ  యోగమే జన్మంతా; ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభావామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ  భగవద్గీత; ఈ బోసి నోటి తాత
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
 మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి
సత్యాహింసల మార్గ జ్యోతి; నవ శకానికే నాంది

రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్
రఘుపతి  రాఘవ రాజారాం  పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత; సిసలైన జగ్జేత
చరఖా యంత్రం చూపించి స్వదేశి  సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బందిచాడుర జాతి పిత;  సంకల్ప బలం చేత
సూర్యుడు  అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడి రాత్రికి  స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి
పదవలు కోరని పావన మూర్తి; హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలా తలపై నడిచిన ఈ నాటి సంగతి
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరలాకు చెప్పండి

30, మే 2012, బుధవారం

ఎవరో మోక్షము

ఎవరో మోక్షము నిచ్చు వారలని మీకేలా వృథా భ్రాంతి మీ
వ్యవసాయంబ గడించి పెట్టవలె మీ వాల్లభ్యమున్ మీనమే
ష వివాదంబుల కాలమేగె సమరోత్సాహమ్మునం బేర్చి మీ
భవమున్ ధన్యము జేసికొండు మిమునొంపన్ బుట్టి లేడెవ్వడున్

5, మార్చి 2009, గురువారం

అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

గత జీవిడగు పతిన్ బ్రతికించుకొన్నట్టి
సావిత్రి భరత సతియె కాదె
తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె
చంద్రమతి పవిత్ర సతియ కాదె
కుల సతీత్వమునకై గుండాన దూకినా
సీత భారత ధరాజాత గాదె
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
దమయంతి భారత రమణి గాదె

సప్త సాగర పరివేష్టితోర్వితలము
భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు
భావ సంపదకిది మహా పంట భూమి
అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

4, మార్చి 2009, బుధవారం

ఖండ ఖండాంతర

ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన
మహనీయులను గన్న మాతృ భూమి
పాశ్చాత్య వీరుల పారద్రోలించుయు
స్వాతంత్రమును గన్న సమరభూమి
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్య భూమి

చిత్రకళల తోడ చిత్రమైయున్నట్టి
భరత భూమియందు జననమొంది
భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ
భాధ్యతంత మీదె బాలులార !

2, మార్చి 2009, సోమవారం

ఏ దేశమేగినా ఏందు కాలిడినా

ఏ దేశమేగినా ఏందు కాలిడినా
ఏ ఫీఠమెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వ పుణ్యమో, ఏ యొగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోచె యీ తల్లి కనక గర్భమున

లేదుర ఇటువంటి భూదేవి యెందు
లేరుర మనవంటి పౌరులింకేదు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగ
శౌర్య హారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువులల్లంగ
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలుగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనంబెగయ
సౌందర్యమెగబోయు సాహిత్యమలర

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట

పృథివి దివ్యౌష్ధుల్ పిదికెర మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలర? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ