30, మే 2012, బుధవారం

బలయుతుడైన వేళ

బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని యాతదే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చు తఱి సఖ్యము జూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!

ఎవరో మోక్షము

ఎవరో మోక్షము నిచ్చు వారలని మీకేలా వృథా భ్రాంతి మీ
వ్యవసాయంబ గడించి పెట్టవలె మీ వాల్లభ్యమున్ మీనమే
ష వివాదంబుల కాలమేగె సమరోత్సాహమ్మునం బేర్చి మీ
భవమున్ ధన్యము జేసికొండు మిమునొంపన్ బుట్టి లేడెవ్వడున్