18, ఆగస్టు 2010, బుధవారం

అమృతం

అయ్యోలు హమ్మొలు, ఇంతెనా బ్రతుకు హూ హూ!
ఆహలు ఓహొలు ఉంటాయి, వెతుకు హా హా!
మన చేత్తులొనే  లేదా రిమొట్ కంట్రోలు!
ఇట్టే మర్చేదాం ఎడుపుగొట్టు ప్రొగ్రాములు
వార్తల్లో హెడ్లైన్సా?... మనకొచ్చే చిలిపి కష్టాలు
ఐడిన్ తో అయిపోయే...  గాయలే మనకు గండాలు

ఎటో... వెల్లిపోతూ, నిను చూసిందనుకొవా ట్రబులు
"hello how do you do?" అని అంటోంది, అంతే నీ లెవలు
ఆతిద్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా?
తీరిగ్గా నీతొ కాలక్షేపం చెస్తుందా?
గాలైన రాదయ్య! నీదసలే ఇరుకు అద్దిల్లు !
కాలైనా పెడుతుందా? నీ ఇంట్లొ పెను తుఫానసలు?

ఒరే ఆంజినేలు, తెగ ఆయస పడిపొకు చాలు
మనం ఈదుతున్నాం, ఒక చెంచాడు భవ సాగరలు
కరంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువైతె కన్నీల్లూ!
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లొబల్ వార్
భారిగా ఫీలయ్యే టెన్షన్లెమి పడొద్దు, గొర్లీ మార్