21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎంతవరకూ ఎందుకొరకు

ఎంతవరకూ ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉందని చెప్పెదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక అలపేరూ
మనకిలా ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నద్ది
చుట్టు అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చుప్పుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరు అన్ని కలిపితే నువ్వే కాదా.. కాదా..

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృస్యాలై

నీడలూ నిజల సాక్షాలే
శత్రువులు నీలోని  లోపాలే - స్నేహితులు నికున్న ఇస్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమికోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుకా చావూ రేండే రెండు- నీకవి సొంతం  కావు పోనీ
జీవితకాలాం నీదే నేస్తం రంగులు ఎం వేస్తావో కాని..







తప్పులు

తప్పులెన్ను వారు తండోపతండంబులు 
లుర్వి జనులకుండు తప్పులు
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు 
విశ్వదాభిరామ వినుర వేమ!