10, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం

చిత్రం: లక్ష్మి నివాసం
 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమే రా అన్నిటికి మూలం
మానవుడే ధనమన్నది సృజియించెను రా. దానికి తానె తెలియని దాసుడాయె రా !
మానవుడే ధనమన్నది సృజియించెను రా. దానికి తానె తెలియని దాసుడాయె రా !
ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే...  ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే...
గుణవంతుడు భలవంతుడు భగవంతుడు రా...
ధనమే రా అన్నిటికి మూలం


ఉన్ననాడు తెలివి కలిగి పొడుపు చేయరా
లేని నాడు ఒడలు వొంచి కూడబెట్టరా
కొండలైను కరిగిపోవు కూర్చొని తింటే
కొండలైను కరిగిపోవు కూర్చొని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే...
 ధనమే రా అన్నిటికి మూలం


కూలి వాని చెమటలో ధనమున్నది రా
కాలి కాపు కండల్లో ధనమున్నది రా
కూలి వాని చెమటలో ధనమున్నది రా
కాలి కాపు కండల్లో ధనమున్నది రా
శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం
శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

5, ఆగస్టు 2011, శుక్రవారం

ఎగిరే ఎగిరే... from కొంచెం ఇష్టం కొంచెం కష్టం

ఎగిరే ఎగిరే... ఎగిరే ఎగిరే...
చూపే ఎగిరెనే... చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే... భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరెనే... పరిచయం అవ్వని తోవలో
fly high in the sky...
ఎగిరే... ఎగిరే...  పైకెగిరే
కలలే... అలలై పైకెగిరే
పలుకే... స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా...


మనసే అడిగన ప్రశ్నకే  బదులొచ్చెను  కదా... ఇపుడే 

ఎపుడు చూడని లోకమే ఎదురోచ్చెను కదా...  ఇచటే   
 ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం... తెలిసింది ఈ క్షణం
మౌనం కరిగెనే...  మాటల సూర్యుడి ఎండలో
స్నేహం దొరికనే.. నవ్వుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే... మెరుపులు తారల నింగిలో
fly high in the sky...
ఎగిరే... ఎగిరే...  పైకెగిరే
కలలే... అలలై పైకెగిరే
పలుకే... స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా


తెలుపూ నలుపే కాదురా
పలు రంగులు ఇలా సిద్ధం 
మదిలో రంగులు అద్దరా మనకధలకు అదే అర్ధం 
సరిపోదోయి బ్రతకడం
నేర్చై జీవించడం
గమనం గమనించడం

పయనంలో అవసరం
చేసై సంతకం... నడిచే కాలపు నుదిటిపై 
రాసై స్వాగతం... రేపటి కాలపు పెదవిపై
పంచేయ్ స్నేహితం...   కాలం చదివే కవితవై
fly high in the sky...
ఎగిరే... ఎగిరే...  పైకెగిరే
కలలే... అలలై పైకెగిరే
పలుకే... స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా




28, జులై 2011, గురువారం

విషధరరిపు గమనుడు

విషధరరిపు గమనునికిని, విషగళ సఖునికిని విమల విష శయనునికిన్
విషభవభవ జనకునికిని, విషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపన్ 

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

కారే రాజులు


కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా !

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం 
నిలువెత్తుగా తల ఏత్తడం నేర్పేందుకదే తోలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిల్లో ఎన్నాలిలా ఇక పడివుంటాం 
కునికే మన కనురెప్పలలో వెలిగిద్దాం  రంగుల స్వప్నం 
ఇదిగో నీ దారిటువుందని సూరీడుని రా రమ్మందాం
జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో ...
జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో ...

ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా ఎమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా?
కనుకే ఆ చినుకు ఏరుగా; ఆ ఏరే వరద హోరుగా; ఇంతింతై ఎదిగి అంతగా అంతరేగని సంద్రమైన్దిగా!
 సందిహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా;
ఆలోచోనకన్న త్వరగా అడుగేద్దాం ఆరంభంగా. 
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...

ఏ పని మరి  అసాధ్యంమేం కాదె; ఆ నిజం మరీ మహా రహస్యమా?
వేసే పదం పధం పడదోసే సవాల్లనే ఎదుర్కోమా?
మొదలెట్టక ముందే ముగిసే కధ కాదోయ్ మన ఈ పయనం 
సమరానికి  సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం 
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...

4, డిసెంబర్ 2010, శనివారం

బావా! యెప్పుడు వచ్చితీవు?


బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

చెల్లియొ చెల్లకొ


చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

జెండాపై కపిరాజు


జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎంతవరకూ ఎందుకొరకు

ఎంతవరకూ ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉందని చెప్పెదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక అలపేరూ
మనకిలా ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నద్ది
చుట్టు అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చుప్పుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరు అన్ని కలిపితే నువ్వే కాదా.. కాదా..

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృస్యాలై

నీడలూ నిజల సాక్షాలే
శత్రువులు నీలోని  లోపాలే - స్నేహితులు నికున్న ఇస్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమికోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుకా చావూ రేండే రెండు- నీకవి సొంతం  కావు పోనీ
జీవితకాలాం నీదే నేస్తం రంగులు ఎం వేస్తావో కాని..







తప్పులు

తప్పులెన్ను వారు తండోపతండంబులు 
లుర్వి జనులకుండు తప్పులు
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు 
విశ్వదాభిరామ వినుర వేమ!