13, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం 
నిలువెత్తుగా తల ఏత్తడం నేర్పేందుకదే తోలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిల్లో ఎన్నాలిలా ఇక పడివుంటాం 
కునికే మన కనురెప్పలలో వెలిగిద్దాం  రంగుల స్వప్నం 
ఇదిగో నీ దారిటువుందని సూరీడుని రా రమ్మందాం
జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో ...
జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో....  జాగో జాగోరే జాగో ...

ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా ఎమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా?
కనుకే ఆ చినుకు ఏరుగా; ఆ ఏరే వరద హోరుగా; ఇంతింతై ఎదిగి అంతగా అంతరేగని సంద్రమైన్దిగా!
 సందిహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా;
ఆలోచోనకన్న త్వరగా అడుగేద్దాం ఆరంభంగా. 
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...

ఏ పని మరి  అసాధ్యంమేం కాదె; ఆ నిజం మరీ మహా రహస్యమా?
వేసే పదం పధం పడదోసే సవాల్లనే ఎదుర్కోమా?
మొదలెట్టక ముందే ముగిసే కధ కాదోయ్ మన ఈ పయనం 
సమరానికి  సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం 
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...
జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో... జాగో జాగోరే జాగో...

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

anayya bhaga rasavu keep going

Adi చెప్పారు...

suuuuper annayya. adaragottesav.... :)

Sasikanth Gudla చెప్పారు...

@pandu - i haven't written this