19, జనవరి 2012, గురువారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - II

                                 శీర్షిక: హాస్యం 
                          ఉప శీర్షిక: హాస్య బ్రహ్మ జంధ్యాల 

"సుపుత్రా... సైంధవా..."
"పిలిచావ నాన్న?"
"రాత్రే బియ్యం మూట ఇక్కడ పెట్టాను. నువ్వు గాని మాయం చేసావా నాన్న?"
"పొద్దున్న లేవాగానే ఆకలివేసింది నాన్న. తినడానికి ఏమి లేకపోతె బియ్యం తినెసాను!"
"పన్నెండు కిలోల బియ్యం తిన్నావా నాన్న! శభాష్! అయితే ఓ పనిచెయ్యి.  పది బిందెల వేడి నీరు తాగు లోపల అన్నం ఉడుకుతుంది!"
"తొందరగా వంట చెయ్యి నాన్న ఆకలివేస్తోంది!"
"ఎం ఇదీ పిక్కుతిన్దామనే! వదులు చెయ్యి. వంట? వంట దేంతో చేయ్యను నా బొంద? బాబు సర్వభక్షక నువ్వు ఇంతవరకు తిననది నరమాంసం మాత్రమే  అనుకుంటా? అవునా?"
"అవును నాన్న."
"అయితే ఒక పని చేస్తా నాన్న . ఈ నాలుగు స్టవ్వులు వెలిగించి, వాటి మీద నేను పడుకుంటాను. దోరగా కాలగానే, నన్ను దించేసి,  నా మీద కాస్త ఉప్పు జల్లుకొని తినేసేయి"
"ఉప్పు డబ్బా ఎక్కడుంది నాన్న?"
-పడమటి సంధ్యా రాగం

"నేనో కొత్త గేయం రాసాను వినిపిస్తాను వుండండి."
"గేయమా? వినిపించి గాయం చేయండి."
"నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా!
నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా!
నేను రచియిత్రి కాన్నన వాడిని రాయెత్తి కొడతా!
నేను రచియిత్రి కాన్నన వాడిని రాయెత్తి కొడతా!"
"భేషుగ్గా వుంది... మీ కవిత్వం వింటుంటే నా స్వేద రంద్రాలన్ని సూదులుతో గుచ్చుతున్నంత సంబరంగా వుంది నరనరాలన్నిటికి నిప్పెట్టినంత ఆనందంగా వుంది!"
-చంటబ్బాయి

అసలు తాజ్ మహల్ నేను ఎందుకు కట్టించాను?
అశోకుడు ఆడుకోవాడనికే కదా!
మరి Ronald Regan అలా అంటాడేమిటి?
అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజమవుతుందా?
ఏమో ! మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మి భాయిని, మా అబ్బాయి S. V. రంగారావుని అడగాలి.
ఇదిగో ఎవరక్కడ? మా ఏనుగుని రిక్షా మీద తీసుకొని రండి. నేను Dolphin హోటల్లో టిఫిన్ చేసి కురుక్షేత్ర యుద్దానికి వెళ్ళాలి.
-చంటబ్బాయి 

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - I

                                    శీర్షిక: మనిషి  
మనం మన నమ్మకాలని నమ్ముకునేవాల్లము సర్.  మనం గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది.
-గోల్కొండ హైస్కూల్

నిద్రలో అందమైన కల వస్తే మనం మేలుకోము. ఆ మంచి కలలోనే నిద్ర పోతాము. అదే పీడ కలైతే  మెలుకువ వస్తుంది; జాగ్రత్త పడతాం. అలాగే దు:ఖం లేకపోతె ఈ ప్రపంచం నిద్రపోతుంది. దు:ఖం ఉండబట్టే కదా ఒక బుద్దుడు వచ్చాడు. అన్వేషణ, విచారణ మొదలైంది. 
-గమ్యం

రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తావు అని అడిగితే?
 హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను;
 భార్యాభర్తలు మధ్యన చిచ్చు పెడతాను;
తండ్రి బిడ్డలను విడదీస్తాను;
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను;
ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట!
-ఆ నలుగురు 

అవసారాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప; హీరోలు, విలన్లు లేరీ నాటకంలో!
 మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే... అహం;
ప్రతి పురుగునూ కదిలించే నిజం ఒక్కటే ... ఆకలి;
తపించే అత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే... ఆశ.
 ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచోన మసకబారిపోతుంది. నీతి నిజాయితిలూ కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి.
- ప్రస్థానం

పెళ్లికి అవసరమైంది ఒక్కటి కాబొయె ఇద్దరి అభిమతాలు కలవటం తప్ప మతాలూ, కులాలు కలవడం కాదు. రాముడు అన్నా,  క్రీస్తు అన్నా,  అల్లా అన్నా, ఎల్లా అన్నా దేవుడు ఒక్కడే! పేర్లు వేరే; అంతే. నన్ను మీ పిన్ని ఏవండి అని పిలిస్తుంది. నువ్వు బాబాయ్ అని పిలిస్తావు. మా అన్నయ్య  రామం అంటాడు. మీ ముగ్గ్గురు మూడు విధాలుగా  పిలిచేది నన్ను ఒక్కడినే కదమ్మా. పిలుపుల్లో తేడాలు ఉంటాయంతే ! ఆ పైన ఉండే వ్యక్తో శక్తో ఒక్కటేనమ్మ. 
-పడమటి సంధ్యా రాగం

17, జనవరి 2012, మంగళవారం

వినదగు నెవ్వరు చెప్పిన

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజము  దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి