శీర్షిక: మనిషి
మనం మన నమ్మకాలని
నమ్ముకునేవాల్లము సర్. మనం గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే
నమ్మకం నాకుంది.-గోల్కొండ హైస్కూల్
నిద్రలో అందమైన కల వస్తే మనం మేలుకోము. ఆ మంచి కలలోనే నిద్ర పోతాము. అదే పీడ కలైతే మెలుకువ వస్తుంది; జాగ్రత్త పడతాం. అలాగే దు:ఖం లేకపోతె ఈ ప్రపంచం నిద్రపోతుంది. దు:ఖం ఉండబట్టే కదా ఒక బుద్దుడు వచ్చాడు. అన్వేషణ, విచారణ మొదలైంది.
-గమ్యం
రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తావు అని అడిగితే?
హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను;
భార్యాభర్తలు మధ్యన చిచ్చు పెడతాను;
తండ్రి బిడ్డలను విడదీస్తాను;
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను;
ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట!
-ఆ నలుగురు
అవసారాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప; హీరోలు, విలన్లు లేరీ నాటకంలో!
మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే... అహం;
ప్రతి పురుగునూ కదిలించే నిజం ఒక్కటే ... ఆకలి;
తపించే అత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే... ఆశ.
ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచోన మసకబారిపోతుంది. నీతి నిజాయితిలూ కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి.
- ప్రస్థానం
పెళ్లికి అవసరమైంది ఒక్కటి కాబొయె ఇద్దరి అభిమతాలు కలవటం తప్ప మతాలూ, కులాలు కలవడం కాదు. రాముడు అన్నా, క్రీస్తు అన్నా, అల్లా అన్నా, ఎల్లా అన్నా దేవుడు ఒక్కడే! పేర్లు వేరే; అంతే. నన్ను మీ పిన్ని ఏవండి అని పిలిస్తుంది. నువ్వు బాబాయ్ అని పిలిస్తావు. మా అన్నయ్య రామం అంటాడు. మీ ముగ్గ్గురు మూడు విధాలుగా పిలిచేది నన్ను ఒక్కడినే కదమ్మా. పిలుపుల్లో తేడాలు ఉంటాయంతే ! ఆ పైన ఉండే వ్యక్తో శక్తో ఒక్కటేనమ్మ.
-పడమటి సంధ్యా రాగం
1 కామెంట్:
పుసీ... కేకో కేకా...
కామెంట్‌ను పోస్ట్ చేయండి