26, ఫిబ్రవరి 2012, ఆదివారం

లావొక్కింతయు లేదు

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెబ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్ఛెఁదనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరంబెఱెఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

పరమపురుషునే భజియింతున్

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వునవిశ్వున్
శాశ్వతునజు బ్రహ్మప్రభు
నీశ్వరునింబరమపురుషునే భజియింతున్

లోకంబులు లోకేశులు

లోకంబులు లోకేశులు
లోకస్థులుదెగినఁదుదినలోకంబగు పెం
జీకటికవ్వలనెవ్వం
డేకాకృతి వెలుఁగునతనినే సేవింతున్

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

చదువులలో మర్మమెల్లఁజదివితిఁదండ్రీ

చదివించిరి నను గురువులు 
చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవిగలవు పెక్కులు 
చదువులలో మర్మమెల్లఁజదివితిఁదండ్రీ

విష్ణుదేవు చారిత్రంబుల్

చిత్రంబులు త్రైలోక్యప 
విత్రంబులు భవలతాలవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన 
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ 

మాటలువేయునేల

మందారమకరందమాధుర్యమునఁదేలు 
మధుపంబుబోవునే మదనములకు 
నిర్మల మందాకినీవీచికలఁదూఁగు 
రాయంచజనునె తరంగిణులకు 
లలితరసాలపల్లవఖాదియై చొక్కు 
కోయిల చేరునే కుటజములకుఁ
బూర్ణేందుచంద్రికా స్పురితచకోరక
మరుగునే సాంద్రనీహారములకు


నంబుజోదరదివ్యపాదారవింద 
చింతనామృతపానవిశేషమత్త 
చిత్తమేరీతినితరంబుఁజేరనేర్చు 
వినుతగుణశీల మాటలువేయునేల

11, ఫిబ్రవరి 2012, శనివారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - IV

                                       శీర్షిక: హాస్యం 


Trasnformerలకి  అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. Current తీగలెక్కి ఆడుకుంటానంటావెంటయ్యా? కాకిలా మాడిపోతావు!  
-మన్మధుడు

వాడు తెలివిగలవాడు కాబట్టి, పెళ్లి అవ్వకుండానే ఆడవాళ్ళు అందంగా ఉండరని తెలుసుకున్నాడు!
-అతడు  

పదేళ్ళకే అన్ని చూసేస్తే, పాతికేళ్ళకి TV చూడడం తప్ప ఇంకేం చేస్తాడు?  
-అతడు

"అమ్మాజీ. నువ్వు  ఎంచేస్తావోగాని, వాడిని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా ఆపు."
"వరలక్ష్మే అతని దగ్గరికి వెళితే?"
 "అదెళుతోందా?" 
"చాల దూరం వెళుతోంది బాబు చాల దూరం వెళుతోంది."
"దూరం వెళుతోందా? దగ్గరకి  వెళుతోందా?"
"దగ్గరవడంలో దూరం వెళుతోంది బాబు.  చేయి జారిపోతోంది."
"నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళని దూరం చెయ్యి."
"మీరెంత దూరంలో ఉన్నారు బాబు?"
"నేను చాల దూరంలో ఉన్నాను. రేపు పొద్దునుకల్లా వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి వాడిని  ఆపు తల్లి"
"అలాగే బాబు. మీ ఉప్పు తినే ..."
"అమ్మాజీ! నువ్వు తినాల్సిన ఉప్పింకా చాల ఉంది. అక్కడ తప్పు జరిగిపోతుందేమో. వెళ్లి ఆపు." 
-అష్టా చెమ్మ


 

8, ఫిబ్రవరి 2012, బుధవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - III

                                        శీర్షిక: మనిషి

ఒక నక్సల్, పోలీసు ఆఫీసురుగా ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు ఎనిమిది గంటలు తరువాత ఇద్దరు మనుషులుగా మిగిలారు
 -జల్సా 

ఆకలేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం; నిద్ర వచ్చిన్నప్పుడు ఎదురుగా పడుకోడానికి మంచం ఉండి కూడా పడుకోకపోడమే జాగారం; కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి, తెగ నరకడానికి తలకాయి ఉండి కూడా నరకకపోడమే మానవత్వం.
-జల్సా

నాకు తెలిసిన పూజల్ల పక్షికి ఇంత ధాన్యం, పసువుకి ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం
- అందరిబంధువయా     


దేవుడి definition అర్ధం అయిపొయింది భయ్యా! ఆడెక్కడో పైన ఉండడు. నీలోనూ... నాలోనూ... ఇక్కడే ఉంటాడు. అవతలోడి సాయం కోసం అడిగినప్పుడు ఠాప్ అని బయటకోస్తాడు. అప్పుడు వందేంటి; లక్షలు కోట్లు కూడా ఇస్తాడు. ఏది అనుకుంటే అది అయిపోద్ది! 
- ఖలేజ  


దేవుడు మనుషులిని ప్రేమించడానికి, వస్తువులుని వాడుకోవాడానికి సృష్టించాడు. కాని మనమే  confusionతో మనుషులిని వాడుకుంటున్నాం; వస్తువలని ప్రేమిస్తున్నాం!   అది మారిన రోజున అంతా సంతోషమే.
-పిల్ల జమిందార్ (2011)