31, ఆగస్టు 2012, శుక్రవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - VI

                               శీర్షికలు :  ప్రాస, హాస్య బ్రహ్మ జంధ్యాల  
    
"అసలు పెళ్ళి కావలసిన పిల్ల ఇంత రాత్రిదాకా అడవిలో తిరుగుల్లేమిటి?"
 "చిన్నప్పుడు బల్లెగ్గొట్టి, గుర్రపు బల్లెక్కి,  జీళ్ళు, ఇంకా కుల్లు తిల్లు తింటూ, పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ, గుళ్ళు, గోపురాలు తిరుగుల్లు తిరిగి, అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు, రోజా తిరుగుల్ల గురించి మాట్లాడడమా? అసూయాంతకారా."
"అబ్బా, నీ ప్రాసతో చస్తన్నాను నాన్న. గుక్క తిప్పుకోకుండా, ఎంత ప్రాస మాట్లడతావో మాట్లాడు చూస్తాను."
"సరదాగా ఉందా?"
"ఊ"
"ఈస్టు స్టువర్టుపురం స్టేషను మాష్టరుగారి  ఫస్ట్ సన్ వెస్టుకెళ్ళి తనకిష్టమైన, అతి కష్టమైన బారిష్టర్ టెస్టులో, ఫస్ట్ క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్ష్టింటాయనని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే;ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్టులో బెస్ట్ బెస్ట్ అంటూతినేసి హోస్టుకు కూడా  మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్టు చేయకండా ఆయన సుష్టుగా బోంచేసి పేస్టు పెట్టి పల్లు తోముకొని మరీ రెస్టు తీసుకున్నాడట. ఏ రుస్టూ లేకుండా. చాలా? ఇంకా వదలమంటావా భాషా బలటాలు; మాటల తూటాలు; యతి ప్రాసల పరోటాలు."
-వేటగాడు (పాతది)


" నాన్న నీ ప్రాస ఆపు చస్తున్నాను. ఈ జన్మలోనువ్వు కధ రాయలేవు. రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ఈ ప్రాస ప్రాయాసున్ను?"
" నోరు ముయ్. మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా, బక్కచిక్కిన కుక్క గొడుగు మొక్కలా,  చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోటిలో కుక్కుతూ, గోక్కుతూ, బెక్కుతూ, చుక్కలు లెక్కబెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని, డొక్కు వెధవలా గోళ్లు చెక్కుకుంటూ, నక్క పీనుగులా చక్కిలాలు తింటూ,  అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా,  చిక్కుజుట్టేసుకొని, ముక్కుపొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాని రక్కుతూ, పెక్కు దిక్కు మాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి , ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే;   ఏ పక్కోకో ఓ పక్కకెళ్ళి, పిక్క బలం కొద్ది తిరిగి, నీ డొక్కసుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కిలు తినిపించి, నీ లక్కు పరీక్షించుకొని, ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకొని తీసుకురావొచ్చుకదరా తిక్క సన్నాసి."
-ఆనంద భైరవి.
                                  

28, ఆగస్టు 2012, మంగళవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - V

                                    శీర్షికలు: మనిషి, భాష


ఎవరూ  పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి?
-మాయాబజార్(1957) 

తెలుగు  చచ్చిపోయే పరిస్థితే వస్తే, దాని కంటే ఒక్క రోజు ముందు నేనే చచ్చిపోతానురా. పక్క రాష్ట్రాల వారు భాషా భాష అని చచ్చిపోతుంటే, మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. 
తెలుగంటే ముప్పై అయిదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా.
అది మనం అమ్మతో భాదలని, ఆనందాలని పంచుకొనే వారధి. అయినా దెబ్బ తగిలితే shit అని ఆశుద్దాని నోటిలో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్ధమౌతుందిరా?
-పిల్ల జమిందార్ (కొత్తది) 

పాండిత్యం  కన్నా జ్ఞానమే ముఖ్యం
-మాయాబజార్(1957)

ఆశ cancer ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది. భయం ulcer ఉన్నవాడిని కూడా చంపేస్తుంది.
-జులాయి

పరిగెత్తే  నీళ్లకు ఒళ్లంతా కాళ్ళు; భగభగా మండే మంటకు ఒళ్లంతా నోళ్ళు; కీచకులకి ఒళ్లంతా కళ్ళు.
-పెళ్ళి పుస్తకం

అసూయ ఘాటైన ప్రేమకు thermometer.
-పెళ్ళి పుస్తకం

మంచీ చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. 
-పెళ్ళి పుస్తకం 

గెలుపేముందిరా! మహాయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ఈ ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయమౌతుంది.
-పిల్ల జమిందార్ (కొత్తది)  

మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనషి తనకు తానుగా ఏర్పరుచుకున్న హద్దుల పరిధి మతం.   ఈ ప్రపంచమంతా ఒక్క కుటుంబం; వసుదైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే మతం; అది మానవత్వం. సమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం. మనుషుల బతుకులను చితుకులు చేసి మండిచేది మతం కాదు; మనకది హితం కాదు. అదే మతమైతే, ఆ మతం ఎంత గొప్పదైన వద్దు; నాకు వద్దు.
 -పడమటి సంధ్యా రాగం