విడదీయగానౌనె? వేయండ్ల పద్య సుగంధమ్ము నన్నయ్య బంధమిపుడు?
పంచీయగానౌనె? పశులకాపరికైన పాడనేర్పిన మన భాగవతము!
పగలు గోట్టగనౌనె? బంఢనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి,డాలు
పాయచీల్చగనౌనె? బంగారు తోటలో ఘంటసాలగ పారు గాన ఝరిని
ప్రాంతములు వేరుపడినను భాద లేదు
స్వాంతములు వేరుపడకున్న చాలునదియె
తెలుగు విడిపోదు చెడిపోదు
తెలుగు వెలుగు రెండు కన్నులతో ఇక నుండి వెలుగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి