భగవాన్ శ్రీ సత్య సాయి బాబా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2009, గురువారం

అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

గత జీవిడగు పతిన్ బ్రతికించుకొన్నట్టి
సావిత్రి భరత సతియె కాదె
తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె
చంద్రమతి పవిత్ర సతియ కాదె
కుల సతీత్వమునకై గుండాన దూకినా
సీత భారత ధరాజాత గాదె
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
దమయంతి భారత రమణి గాదె

సప్త సాగర పరివేష్టితోర్వితలము
భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు
భావ సంపదకిది మహా పంట భూమి
అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

4, మార్చి 2009, బుధవారం

ఖండ ఖండాంతర

ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన
మహనీయులను గన్న మాతృ భూమి
పాశ్చాత్య వీరుల పారద్రోలించుయు
స్వాతంత్రమును గన్న సమరభూమి
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్య భూమి

చిత్రకళల తోడ చిత్రమైయున్నట్టి
భరత భూమియందు జననమొంది
భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ
భాధ్యతంత మీదె బాలులార !