16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అటజని కాంచె

అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

15, సెప్టెంబర్ 2011, గురువారం

జగతి ఉపకర్తలు

తరువులతిరస ఫల గురుతగాంచు
నింగి వ్రేలుచు నమ్రుతమొసంగు మేఘుడు
ఉద్దతులు గారు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకిది సహజ గుణము

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే

చిత్రం : వెంకి 

హొయ్  అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే 
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా?
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా?  
అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
హెలా హెలాలా జాబిల్లి కంట్లో కన్నిల్లా?
 హెలా హెలాలా వెన్నల కురవాలా !

హొయ్  బాధలో కన్నులే కందినంత మాత్రానా...

పోయిన కాలము పొందలేముగా !
రేగిన గాయమే ఆరానంత మాత్రానా 
కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేలా ఆకాశం ఉందే మనకోసం
వందేళ్ళ సంతోషం... అంతా మన సొంతం 
ఈ సరదాలు, ఆనందాలు అలలైయేలా అల్లరి చేద్దాం
అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
హెలా హెలాలా హెలెలాలలాళ్ళలా
హెలా హెలాలా హెలెలాలా  

ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా నా ఎద... నీ జతే కోరుతుందిగా

ఒంటరి దారిలో నాకు తోడువైనావు... ఎన్నడు నీడగా వెంట ఉండవా?
హె...  అరె కలలే నిజమైనాయి... కనులే వొకటయ్యీ
కలిపేస్తూ ని చెయ్యి... అడుగే చిందెయ్యీ
మన స్నేహాలు సావాసాలు కలకాలపు కధ కావాలి

10, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం

చిత్రం: లక్ష్మి నివాసం
 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమే రా అన్నిటికి మూలం
మానవుడే ధనమన్నది సృజియించెను రా. దానికి తానె తెలియని దాసుడాయె రా !
మానవుడే ధనమన్నది సృజియించెను రా. దానికి తానె తెలియని దాసుడాయె రా !
ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే...  ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే...
గుణవంతుడు భలవంతుడు భగవంతుడు రా...
ధనమే రా అన్నిటికి మూలం


ఉన్ననాడు తెలివి కలిగి పొడుపు చేయరా
లేని నాడు ఒడలు వొంచి కూడబెట్టరా
కొండలైను కరిగిపోవు కూర్చొని తింటే
కొండలైను కరిగిపోవు కూర్చొని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే...
 ధనమే రా అన్నిటికి మూలం


కూలి వాని చెమటలో ధనమున్నది రా
కాలి కాపు కండల్లో ధనమున్నది రా
కూలి వాని చెమటలో ధనమున్నది రా
కాలి కాపు కండల్లో ధనమున్నది రా
శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం
శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమే రా అన్నిటికి మూలం ! ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం