చిత్రం : వెంకి
హొయ్ అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా?
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా?
అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
హెలా హెలాలా జాబిల్లి కంట్లో కన్నిల్లా?
హెలా హెలాలా వెన్నల కురవాలా !
హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రానా...
పోయిన కాలము పొందలేముగా !
రేగిన గాయమే ఆరానంత మాత్రానా
కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేలా ఆకాశం ఉందే మనకోసం
వందేళ్ళ సంతోషం... అంతా మన సొంతం
ఈ సరదాలు, ఆనందాలు అలలైయేలా అల్లరి చేద్దాం
అనగనగ కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే... ప్రతి ఉదయం మనదేలే
హెలా హెలాలా హెలెలాలలాళ్ళలా
హెలా హెలాలా హెలెలాలా
ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా నా ఎద... నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు... ఎన్నడు నీడగా వెంట ఉండవా?
హె... అరె కలలే నిజమైనాయి... కనులే వొకటయ్యీ
కలిపేస్తూ ని చెయ్యి... అడుగే చిందెయ్యీ
మన స్నేహాలు సావాసాలు కలకాలపు కధ కావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి