కమలాక్షునర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁజూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
మధువైరిఁదవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తమునిమీఁది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తునిఁబ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁజెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరిఁజేరుమనియెడి తండ్రి తండ్రి
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁజూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
మధువైరిఁదవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తమునిమీఁది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తునిఁబ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁజెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరిఁజేరుమనియెడి తండ్రి తండ్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి