8, ఫిబ్రవరి 2012, బుధవారం

చలన చిత్రాలనుండి కొన్ని సంభాషణాలు/మాటలు - III

                                        శీర్షిక: మనిషి

ఒక నక్సల్, పోలీసు ఆఫీసురుగా ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు ఎనిమిది గంటలు తరువాత ఇద్దరు మనుషులుగా మిగిలారు
 -జల్సా 

ఆకలేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం; నిద్ర వచ్చిన్నప్పుడు ఎదురుగా పడుకోడానికి మంచం ఉండి కూడా పడుకోకపోడమే జాగారం; కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి, తెగ నరకడానికి తలకాయి ఉండి కూడా నరకకపోడమే మానవత్వం.
-జల్సా

నాకు తెలిసిన పూజల్ల పక్షికి ఇంత ధాన్యం, పసువుకి ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం
- అందరిబంధువయా     


దేవుడి definition అర్ధం అయిపొయింది భయ్యా! ఆడెక్కడో పైన ఉండడు. నీలోనూ... నాలోనూ... ఇక్కడే ఉంటాడు. అవతలోడి సాయం కోసం అడిగినప్పుడు ఠాప్ అని బయటకోస్తాడు. అప్పుడు వందేంటి; లక్షలు కోట్లు కూడా ఇస్తాడు. ఏది అనుకుంటే అది అయిపోద్ది! 
- ఖలేజ  


దేవుడు మనుషులిని ప్రేమించడానికి, వస్తువులుని వాడుకోవాడానికి సృష్టించాడు. కాని మనమే  confusionతో మనుషులిని వాడుకుంటున్నాం; వస్తువలని ప్రేమిస్తున్నాం!   అది మారిన రోజున అంతా సంతోషమే.
-పిల్ల జమిందార్ (2011)  


 

2 కామెంట్‌లు:

RamCharan Vemulakonda చెప్పారు...

తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి.
అయినా దెబ్బ తగిలితే shit అని ఆశుదాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్ధమవుతుంది రా?
-Pilla Jamindhar

RamCharan Vemulakonda చెప్పారు...

డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కాని, ప్రేమకి మాత్రం డబ్బు కావాలి.
డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ధి.
రూపాయి సంపాదించలేని ఏ వెధవకి I LOVE YOU చెప్పే అర్హత లేదు.
మనకున్న ప్రతీ relation కి మూడు ఇవ్వాల్సి ఉంటుంది: LOVE, MONEY, TIME.
వీటిల్లో ఏ ఒక్కటితగ్గినా ఆ relation లో problem స్టార్ట్ అవుతుంది.
-నేనింతే