రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నామ్ సబుకో సన్మతి దే భగవాన్
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
కరెన్సీ నోటు మీద; ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధి
భరత మాత తలరాతను మార్చిన విధాతర గాంధి
తరతరాల యమయాతను తీర్చిన వరదాతర గాంధి
కొంత మంది సొంతపేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆ శ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన ఆవధూత; అపురూపం ఆ చరిత
కర్మ యోగమే జన్మంతా; ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభావామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత; ఈ బోసి నోటి తాత
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి
సత్యాహింసల మార్గ జ్యోతి; నవ శకానికే నాంది

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత; సిసలైన జగ్జేత
చరఖా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బందిచాడుర జాతి పిత; సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి
పదవలు కోరని పావన మూర్తి; హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలా తలపై నడిచిన ఈ నాటి సంగతి
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరలాకు చెప్పండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి