ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని.. లేలే అని
జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం
అందరని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని
వేకువే వేచిన వేళలో లోకమే కోకిలయి పాడుతుంది
Life is Beautiful Life is Beautiful || 4||
ఆహా ఆహా అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
రోజంతా అంతా చేరి సాగించేటి
చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్దోలే ఇంటా బయటా మాపై విసిరే
చిన్ని విసురులు కొన్ని కసురులు
ఎండయినా వానయినా ఏం తేడా లేదు
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు నవ్వులు బాధలు
సందడులు సంతోషాలు పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
Life is Beautiful Life is Beautiful || 4||
సాయంత్రమైతే చాలు చిన్న పెద్దా
రోడ్డు మీదనే హస్కు వేయడం
దీవాలి హోలి క్రిస్మస్ భేదం లేదు
పండగంటే పందిళ్ళు వేయడం
ధర్నాలు రాస్తా రోకులెన్నవుతున్నా
మమ్ము చేరనే లేవులే ఏ క్షణం
మా ప్రపంచమిది మాదిది
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది ఈ రంగుల రంగుల జీవితం
Life is Beautiful Life is Beautiful || 4||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి