11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మొదటి అడుగు

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు... ఎవరో ఒకరు... ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి  అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళతో బాట అయినది
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా 
అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే 
మబ్బు పొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా  
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు

చెదరగకపోదుగా  చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు  చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాలరాతిరి
పెదవి  ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి కరుగునా? 
జాలి  చూపి తీరమే దరికి చేరునా?
ఎవరో ఒకరు; ఎపుడో అపుడు; నడవరా ముందుగా
అటో ఇటో ఎటో వైపు... అటో ఇటో ఎటో వైపు



కామెంట్‌లు లేవు: