24, నవంబర్ 2011, గురువారం

చక్రి సర్వోపగతుండు

ఇందుగలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి  జూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే !



తండ్రి హరిఁజేరుమనియెడి తండ్రి తండ్రి

కమలాక్షునర్చించు కరములు కరములు
 శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 
సురరక్షకునిఁజూచు చూడ్కులు చూడ్కులు 
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము 
విష్ణునాకర్ణించు వీనులు వీనులు 
మధువైరిఁదవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు 
పురుషోత్తమునిమీఁది బుద్ధి బుద్ధి 

దేవదేవుని చింతించు దినము దినము 
చక్రహస్తునిఁబ్రకటించు చదువు చదువు 
కుంభినీధవుఁజెప్పెడి గురుఁడు గురుఁడు 
తండ్రి హరిఁజేరుమనియెడి తండ్రి తండ్రి

సిరి

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు రీతి కరిణిన్ సుమతీ

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

సిరి గల వానికి చెల్లును
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

రంజన చెడి పాండవులరి భంజనులై
విరటుని గొల్వ పాల్పడిరకటా
సంజయ ఏమని చెప్పుదు ?
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
తన కోపమే తనకు శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన  సంతోషమె స్వర్గము
తన దు:ఖ్ఖమే నరకమండ్రు  తధ్యము సుమతి

ఇనుము - మనస్సు

ఇనుము విరగవచ్చు ఇరుమారు ముమ్మారు
కాచి ఆతుక వచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి అతుకవచ్చా?
విశ్వధాబిరామ వినురవేమ

సిరికిన్ జెప్పడు

సిరికిన్ జెప్పడు శంఖు చక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అబ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాం
తరధమ్మిల్లము  చక్కనొత్తడు  వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి
 చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సా హియై







కూరిమి

కూరిమి గల దినములలో
నేరములెన్నడు గలుగనేరవు
మరి యాకూరుమి విరసంబైనను
నేరములే దోచుచునుండు నిక్కము సుమతీ!